Megastar Family Crucial Decision on Mega princess Photos: వివాహం జరిగిన చాలాకాలం తర్వాత ఉపాసన- రాంచరణ్ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్ లోనే ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెగా అభిమానులందరూ ఈసారి వారసుడే వస్తాడని బాగా నమ్మారు, కానీ ఆడపిల్ల పుట్టినా సరే మహాలక్ష్మి పుట్టిందని ఇప్పుడు సంతోషపడుతున్నారు. అయితే నిన్నటి నుంచి ఉపాసన రాంచరణ్ దంపతుల కుమార్తె ఈమె అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫోటోలలో అయితే ఏకంగా ఉపాసన పాపని ఎత్తుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది.
Guntur Kaaram: శ్రీలీల మెయిన్ హీరోయినా? మహేష్ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్!
అయితే మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న, వైరల్ అవుతున్న ఫోటోలు నిజం కాదని ఇప్పటి వరకు ఫోటోలు బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు తమ వారసురాలి ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ వీలైనంత త్వరలోనే అధికారికంగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అనవసరంగా ఎవరెవరివో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో ఆ ఫోటోలు కాకుండా తమ నిజమైన వారసురాలు ఫోటోలను రిలీజ్ చేస్తేనే మంచిదని అభిప్రాయానికి మెగా కుటుంబం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫొటోలు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి ఆ ఫొటోలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది.