టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు .అలాగే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ మరో కొత్త బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.తాజాగా ఎన్టీఆర్ మెక్ డోనాల్డ్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అలాగే టెలివిజన్ లో భారీ ఎత్తున వైరల్ గా మారింది. అయితే తాజాగా ఎన్టీఆర్ మరొక నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం.. ఈయన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యుయలరి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ జ్యుయలరి కంపెనీకి సంబంధించి యాడ్ షూటింగ్ ని కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే ఈ యాడ్ కూడా ప్రసారం కానుంది.అయితే ఎన్టీఆర్ ఇదివరకే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఈ జ్యుయలరి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం గమనార్హం.. ఇక ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.ఇక ఇప్పటికే ఎన్టీఆర్ యాపి ఫిజ్, లీసియస్ మరియు KFC.లాంటి పలు భారీ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఇలా ఎన్టీఆర్ పలు యాడ్ లలో నటిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో నే వుంటున్నారు. ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి దాదాపు ఏడాది గడిచిపోయింది. అందుకే పలు యాడ్స్ లో నటించి ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు ఎన్టీఆర్.