టీ20 ప్రపంచ్ కప్ నేడు భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య మరో ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆటగాళ్లు బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగలడంతో.. మ్యాచ్‌ను 16 ఓవర్లకు 151 పరుగులకు కుదించారు. వర్షం అనంతరం బరిలో దిగిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్ల(16)లో బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయడంతో.. భారత్ 5 పరుగులతో విజయం సాధించింది. కింగ్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అయితే.. అశ్విన్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించి లిట్టన్ దాస్ రన్‌ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అద్భుతమైన త్రో విసిరి 27 బంతుల్లోనే 60 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసిన లిట్టన్ దాస్ పెవీలియన్‌కు పంపాడు.
Also Read : Koti Deepotsavam LIVE: మూడోరోజు కోటి దీపోత్సవం.. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం
అనంతరం బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా 13వ ఓవర్ రెండో బంతికి యాసిర్ అలీని, ఐదో బంతికి మొసాదిక్ హుస్సేన్‌ను పెవీలియన్‌కు పంపించాడు. ఈ ఓవర్ తర్వాత సమీకరణం 18 బంతుల్లో 43 పరుగులుగా మారింది. 42 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే క్రీజులో కుదురుకొని దాటిగా ఆడుతున్న శాంటోను షమీ వెనక్కి పంపి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. 12వ ఓవర్ తొలి బంతికే అర్ష్‌దీప్.. అఫీఫ్ హుస్సేన్‌ను (3 పరుగులు, 5 బంతుల్లో) పెవిలియన్ పంపాడు. అయితే.. ఈ రెండు క్యాచ్‌లనూ సూర్యకుమార్ యాదవే అందుకోవడం విశేషం. ఇదే ఓవర్‌లో అర్ష్‌దీప్ మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 2 పరుగులే ఇచ్చి రెండు వికెట్లను తీశాడు అర్ష్‌దీప్. దీంతో.. మ్యాచ్ ములుపు తీసుకుంది.