Site icon NTV Telugu

India-Pakistan War: భయం గుప్పిట్లో పాక్.. లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై భీకర దాడి..

India Pakistan War

India Pakistan War

జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్‌లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ మొదలైన ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. అయితే.. భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ ఈ క్షిపణులను గాల్లోనే కూల్చివేసింది.

READ MORE: Operation Sindoor Live Updates: కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్, డ్రోన్ల ప్రయోగం…

గురువారం రాత్రి.. పాకిస్థాన్ జమ్మూ, పఠాన్‌కోట్, జైసల్మేర్, ఫిరోజ్‌పూర్ సహా అనేక నగరాలపై తక్కువ సమయంలోనే క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడులను ఎదుర్కోవడానికి భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ S-400 పూర్తిగా సిద్ధంగా ఉండటంతో భారీ గఢం తప్పింది. పాకిస్థాన్‌కి చెందిన క్షిపణులు, డ్రోన్లు గాల్లోకి కనిపించిన వెంటనే.. కూల్చివేసింది. ఈ దాడులతో జమ్మూ, చండీగఢ్, మొహాలి, కచ్, భుజ్ మొదలైన నగరాల్లో కూడా బ్లాక్అవుట్ విధించారు. ప్రతీకార చర్యలో భాగంగా ఇప్పటికే భారత్ మూడు పాకిస్థాన్ ఫైటర్ జెట్లను కూల్చివేసింది.

READ MORE: Big News : జమ్మూలో బ్లాక్ అవుట్ ఎత్తివేత..

Exit mobile version