భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. మనదేశంలోని అనేక నగరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అయితే.. ఈ దాడులను భారత రక్షణ దళం తిప్పికొట్టింది. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా బైకర్ YIHA-III కామికేజ్ డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ డ్రోన్ల ద్వారా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలనుకుంది పాకిస్థాన్.
జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్‌లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్,…
Big Breaking : భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ ఘటనలో F-17S జెట్‌ను కూడా కూల్చివేసినట్లు సమాచారం అందుతోంది. వివరాల ప్రకారం, పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక F-16ను భారత బలగాలు మధ్యలోనే గుర్తించి అడ్డుకున్నాయి. క్షణాల్లో స్పందించిన భారత సైనికులు…