India Pak War : ఖంగున మోగే బాణాసంచా వెలుగులు, బంధుమిత్రుల సందడితో కళకళలాడుతున్న పెళ్లింట ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. గురువారం రాత్రి రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్‌అవుట్ కారణంగా జోధ్‌పుర్‌లోని పావ్టా ప్రాంతంలో జరుగుతున్న ఆ వేడుకలో ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వధూవరులు సప్తపది వేసే శుభఘడియకు సరిగ్గా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే, ఆటంకం ఎదురైనా ఆనందానికి అడ్డుకట్ట పడలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా తమ సెల్‌ఫోన్ల టార్చ్‌లైట్లు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా…
గుజరాత్‌లోని కచ్‌లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. "కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా…
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.. వార్ బ్లాక్ అవుట్ వెలుగులోకి వచ్చింది.. బ్లాక్ అవుట్ అంటే ఏంటి..? అసలు ఎందుకు ఇది అమలు చేస్తారు? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. అసలు Wartime Blackout అంటే ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. శత్రువుల నిఘా నుంచి.. వాళ్ల దాడుల నుంచి.. ప్రజలను రక్షించడానికి భద్రతా చర్యల్లో భాగంగా ప్రకటించేదే వార్‌టైమ్ బ్లాక్అవుట్..
జమ్మూ కశ్మీర్‌లోని సాంబాలో ఒక పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. ఎల్‌ఓసీలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి పెద్ద ఎత్తు కాల్పులు జరుగుతున్నాయి. భారత ఆర్మీ తగిన సమాధానం ఇస్తోంది. అయితే.. భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్మీని పాక్ అడ్డుకుంది. అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది.
జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్‌లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్,…
Blackout Drill: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ఆర్మీ కంటోన్మెంట్‌లో ఆదివారం రాత్రి ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’ నిర్వహించారు. పూర్తిగా లైట్లు ఆర్పేసి, ఎలాంటి వెలుతురు లేకుండా సైన్యం ఈ వ్యాయామంలో పాల్గొంది. తన యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంది. బ్లాక్అవుట్ డ్రిల్ సక్సెస్ కావడానికి ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషన్ మద్దతు, సహకారాన్ని కోరారు. డ్రిల్…
Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది.