గత మూడు రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే.. ఈ మూడు రోజుల్లోనే పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ తమ మధ్యవర్తిత్వం కోసం ఏదో ఒక దేశం ముందుకు రావాలని కోరుకుంటోంది. అప్పుడే…
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ గురువారం రాత్రి భారత్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాలపై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఈ దాడి కాస్త క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో పాకిస్థాన్ లోని సాధారణ ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. చాలా మంది పాక్ అధికారులు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించిందని పలు మీడియా…
జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ చేసిన బహుళ క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ను భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, సియాల్‌కోట్, కరాచీలో దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఈ అంశంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈరోజు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి.…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ సైన్యం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించింది.
పాకిస్థాన్ దుశ్చర్య తర్వాత భారత నావికాదళం రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ యుద్ధ బరిలోకి దిగింది. పాకిస్థాన్‌లో ప్రధాన నగరమైన కరాచీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడి అనంతరం కరాచీ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భీకర దాడిలో కరాచీ నౌకాశ్రయం విధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఓడరేవుతో పాటు కరాచీ నగరంలోని పలు చోట్ల భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ భయాందోళనల్లో మునిగి పోయింది.…
జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్‌లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్,…