రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. భారీ స్థాయిలో రష్యా వైమానిక స్థావరాలను ఉక్రెయిన్ డ్రోన్లు నాశనం చేశాయి. సెమీ ట్రక్కుల్లో రహస్యంగా తరలించిన 117 డ్రోన్లతో రష్యన్ బాంబర్లను పేల్చేశాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లు, క్షిపణి ప్రయోగాలు చేసింది.
జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ చేసిన బహుళ క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ను భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, సియాల్‌కోట్, కరాచీలో దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఈ అంశంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈరోజు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి.…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన పాకిస్థాన్ సైన్యం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించింది.
జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్‌లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్,…
Drone Strike: హిందూ మహా సముద్రంలోని ఓ వ్యాపార నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లైబీరియా జెండాతో ఉన్న ట్యాంకర్ ఇజ్రాయిల్ అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకల్ని లేకపోతే ఇజ్రాయిల్ అనుబంధంగా పనిచేస్తున్న నౌకల్ని యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఇరాన్ వ్యవహరిస్తోందని అమెరికాతో పాటు పలు…