Big News : జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి భయభ్రాంతులకు లోనయ్యారు. గురువారం సాయంత్రం జమ్మూ నగరంలోని విమానాశ్రయం (Jammu Airport) సహా ఏడు ప్రధాన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలతో నగరంలో ఒక్కసారిగా ఆందోళన ఏర్పడింది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై, సమగ్ర గాలింపు చర్యలు ప్రారంభించాయి. తాత్కాలికంగా నగరాన్ని బ్లాక్ అవుట్ చేయగా, ప్రజలకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం, జమ్మూ నగరంపై విధించిన బ్లాక్ అవుట్ ను ఎత్తివేశారు. భారత సైన్యం ప్రకటనలో, ఈ దాడుల్లో దేశానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో భద్రతా బలగాలు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌లో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు రేకెత్తించే ప్రయత్నాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, భారత భద్రతా వ్యవస్థ దానికి తగిన బదులు ఇస్తూ, దేశ రక్షణలో మరోసారి విజయవంతమైంది.