Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో (11, 27 పరుగులు), ఆయన రిటైర్మెంట్ గురించి తీవ్రస్థాయిలో ఊహాగానాలు వచ్చాయి. లార్డ్స్ వన్డే తర్వాత ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారనే పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే, ‘హిట్‌మ్యాన్’ ఇప్పుడే రిటైర్ కావడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి తగ్గట్టుగానే, లార్డ్స్ మైదానంలో 110 బంతుల్లో 138 పరుగులతో చారిత్రాత్మక సెంచరీ బాది రోహిత్ విమర్శకుల నోళ్లు మూయించారు. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన మొదటి భారతీయ క్రికెటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు.
రోహిత్ రిటైర్మెంట్ ఊహాగానాలపై భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. ఇప్పుడు విమర్శకుల ముక్కు కట్ అయింది” అంటూ కైఫ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది ఆయనే నిర్ణయించుకుంటాడని, దేశం కోసం ఎంతో చేసిన ఆ హక్కు ఆయనకు ఉందని మద్దతుగా నిలిచారు. వన్డేల్లో దాదాపు 12 వేల పరుగులు, 34 సెంచరీలు చేసిన ఆటగాడిపై ఇంత ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ప్రస్తుతం రోహిత్‌కు ఎవరి మద్దతు లభించడం లేదని, ఆయన ఒంటరిగా పోరాడుతున్నారని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్, లేదా బీసీసీఐ మీడియా ముందుకు వచ్చి “2027 వన్డే ప్రపంచకప్‌లో మాకు రోహిత్ శర్మ కావాలి, ఆయన ఎంతకాలం అనుకుంటే అంతకాలం ఆడవచ్చు” అని బహిరంగంగా ప్రకటిస్తే, రోహిత్ ఆత్మవిశ్వాసం హిమాలయమంత ఎత్తుకు ఎదుగుతుందని కైఫ్ పేర్కొన్నారు. అందరూ ఆయన ఎప్పుడు ఫెయిల్ అవుతాడా, ఎప్పుడు జట్టు నుంచి తీసేద్దామా అని ఎదురుచూస్తున్న తరుణంలోనే ఈ శతకం వచ్చిందని గుర్తుచేశారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ కంటే ముందైనా రోహిత్‌ను ప్రశాంతంగా ఆడనివ్వాలని కోరారు.
Highest score by an indian batter at Lord’s. pic.twitter.com/oZCI9f0QUx
— Mohammad Kaif (@MohammadKaif) July 20, 2026
మరోవైపు, రోహిత్ శర్మ మాట్లాడుతూ మైదానం వెలుపల జరిగే ఈ విమర్శల ‘సందడి’ గురించి తనకు తెలుసని, కానీ అది తనను ఏమాత్రం ప్రభావితం చేయదని స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభం నుండి ఇవి వింటున్నానని, మ్యాచ్‌లో జట్టు కోసం రాణించడమే తన బాధ్యతని రోహిత్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల నుండి తప్పుకున్న రోహిత్.. భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!