Pakistan: పాకిస్తాన్ లో విచిత్రం చోటుచేసుకుంది. కరాచీకి వెళ్దామని విమానం ఎక్కితే, ఏకంగా సదరు వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో దిగాడు. పాకిస్తాన్ విమానయాన రంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక దేశీయ ప్రయాణికుడి వద్ద వీసా, పాస్‌పోర్టు లేకుండా సౌదీ వెళ్లే విమానంలోకి ఎలా అనుమతించారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Sir Ganga Ram: పాకిస్తాన్ వంటి దేశానికి మతోన్మాదం, ఉగ్రవాదమే ముఖ్యం. ముఖ్యంగా భారత్ అన్నా, హిందువులన్నా ద్వేషం. కానీ ఒక్క హిందువును మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తోంది. భారత్-పాకిస్తాన్ విభజన జరిగి 77 ఏళ్లు పూర్తయినప్పటికీ పాకిస్తాన్‌లో ఆయన ఉనికి శాశ్వతంగా ఉంది. ఆయన మరెవరో కాదు సర్ గంగా రామ్. 1921లో లాహోర్‌లో ఆస్పత్రిని నిర్మించిన సివిల్ ఇంజనీర్, దాత. ఇప్పటికీ ఈ ఆస్పత్రి పాకిస్తాన్‌లో ప్రతీ రోజు వేల మందికి చికిత్స…
వీధుల్లో తిరిగే గ్రామ సింహాలైన కుక్కలతోనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అవి సృష్టించే బీభత్సాలకు మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఎక్కడొక చోట కుక్కుల దాడిలో చనిపోతున్నారు. అలాంటిది అడవుల్లో ఉండే సింహాలు రోడ్లపైకి వస్తే.. ఇంకేమైనా ఉందా? ఇక ప్రాణాలు పోయినట్టే.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది భారత్. ఇటు ఉగ్రవాదుల స్థావరాలను నాశం చేస్తూనే, మరోవైపు పాక్ మిలిటరీకి గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతను కూడా భారత్ బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు తమ మిలిటరీ శక్తిని చూస్తూ గర్వపడిన పాకిస్తాన్‌కి భారత్ గర్వభంగం చేసింది. తమతో పెట్టుకుంటే పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్‌లో కూడా దాడులు చేస్తామని నిరూపించింది.
ఇదిలా ఉంటే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులను తీవ్రం చేసింది. వీటికి ధీటుగా ఇండియా స్పందించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.
Operation Sindoor: భారత్ పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భీకర దాడి చేసింది.
Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్‌గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్లలో జరగాల్సిన పీఎస్ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ చేసిన బహుళ క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ను భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, సియాల్కోట్, కరాచీలో దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఈ అంశంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈరోజు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి.…