Suryakumar Yadav and Tilak Varma Shine as India keep Series Alive vs West Indies: ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్; 37 బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో నిలిచింది. ఇక నాలుగో టీ20 శనివారం జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (42; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కైల్ మేయర్స్ (25; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. వీరిద్దరు 50 పరుగులు జత చేశారు. అక్షర్ పటేల్ ఈ జోడీని విడదీశాడు. చార్లెస్ (12), పూరన్ (20) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కింగ్,హెట్‌మైర్ (9) కూడా ఔట్ అయ్యారు. అయితే పావెల్ (40 నాటౌట్; 19 బంతుల్లో1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఇన్నింగ్స్ చివరలో విండీస్ 150కి పైగా రన్స్ చేసింది. కుల్దీప్ యాదవ్ (3/28) మూడు వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Guntur Kaaram: లుంగీ లో మహేష్ బాబు.. సంక్రాంతికి వచ్చేస్తున్నాడోచ్..
లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్ (1) త్వరగా పెవిలియన్ చేరగా.. శుభమాన్ గిల్ (6) పేలవ ఫామ్ కొనసాగించాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడాడు. ఫోర్స్, సిక్సులు బాదుతూ విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. అతడికి తిలక్ వర్మ కూడా జాతవ్వడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్య సెంచరీ కోల్పోయాడు. సూర్య అనంతరం హార్దిక్ పాండ్యా (20 నాటౌట్)తో కలిసి తిలక్ పని ముగించాడు.