శనివారం నాడు న్యూయార్క్ వేదికగా టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఏకైక వామప్ మ్యాచ్ నేడు భారత్ – బంగ్లాదేశ్ తో తలపడుతోంది. ముందుగా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 182 పరుగులను సాధించింది. ఇక ఇందులో రిషబ్ పంత్ హఫ్ సెంచరీ తో మెరువగా చివరలో హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తమ వంతు పాత్రను పోషించారు.
Olympics 2024: ఒలింపిక్స్ బాక్సింగ్ పోటీల్లో పురుషుల విభాగంలో మొదటి బెర్త్ కన్ఫామ్..
ఇక టీమిండియా బ్యాట్స్మెన్ పరుగుల విషయానికొస్తే.. రోహిత్ శర్మ 23 , సంజు శాంసన్ 1 , రిషబ్ పంత్ 53 రిటైడ్ హర్ట్, సూర్యకుమార్ యాదవ్ 31 , శివం దూబే 40 , హార్దిక్ పాండ్యా 40 నాటౌట్ , రవీంద్ర జడేజా 4 నాటౌట్ పరుగులు చేసారు. మరోవైపు బంగ్లాదేశ్ బౌలర్లు విషయానికి వస్తే.. మహేది హసన్, షోరిఫుల్ ఇస్లాం, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం లు చెరో ఒక వికెట్ తీశారు. దింతో బంగ్లా టార్గెట్ 183.
Road Accident : జర్నీ సినిమా సీన్ రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు..