కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ నాగర్ కొత్వాలి ప్రాంతంలోని చిల్బిలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం యువకుడు బయల్దేరగా.. ప్రియురాలు కూడా తనతో పాటు రైల్వే స్టేషన్ కు వచ్చింది. వారికి ఏ సమస్య వచ్చిందో తెలియదు గానీ.. రైలు దగ్గరికి రాగానే దాని ముందు దూకి సూసైడ్కు పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ముక్కలు ముక్కలైన మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read Also: PAK vs BAN: పాకిస్థాన్ పై మరుపురాని విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్..
కాగా.. మరణించిన యువకుడు రాజేంద్ర సరోజ్, అమేథీ సంగ్రామ్‌ఘర్‌కు చెందినవాడు. యువతి సంగీపూర్ కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు.. ఆస్పత్రికి చేరుకుని తీవ్రంగా రోధించారు. కాగా.. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్లి విగతజీవిగా రావడంపై యువకుడి కుటుంబ సభ్యులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. మరోవైపు.. యువతి కుటుంబంలో కూడా విషాదచాయలు అలుముకున్నాయి.
Read Also: Tamil Nadu Accident: బస్సును ఢీకొన్న వ్యాన్.. గాల్లో ఎగిరిపడ్డ ప్రయాణికులు