ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కారులో సజీవ దహనమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కథనం వెలువడింది. "పొలంలో వరి నాట్లు వేస్తుండగా.. కారులో మంటలు అంటుకోవడం కనిపించింది. పైపు లైన్ లేకపోవడంతో.. బిందెలతో నీళ్ళు పోసి ఆర్పే ప్రయత్నం చేశాం.
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మొదట తగలబడిన కార్‌ను చూసి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం అయ్యారు అని అనుకున్నారు.
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. కదులుతున్న రైలు నుంచి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు నుంచి దూకిన తర్వాత యువకుడి మృతదేహం పిల్లర్‌లో ఇరుక్కుపోగా, బాలిక మృతదేహం నదిలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో ఛతర్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ నాగర్ కొత్వాలి ప్రాంతంలోని చిల్బిలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం యువకుడు బయల్దేరగా.. ప్రియురాలు కూడా తనతో పాటు రైల్వే స్టేషన్ కు వచ్చింది. వారికి ఏ సమస్య వచ్చిందో తెలియదు గానీ.. రైలు దగ్గరికి రాగానే దాని ముందు దూకి సూసైడ్కు…
విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అంటూ నిరుద్యోగులను నమ్మించి వారి దగ్గరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి.. తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనగానే.. నిరుద్యోగులు వారికి భారీ ఎత్తున ముట్టజెప్పారు. ఇదే అదునుగా భావించిన నకిలీ పోలీసులు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది.