HYDRA : బోడుప్పల్‌లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అకస్మిక పరిశీలన నిర్వహించారు. చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు ఇళ్లపై నెంబర్లు వేశారు, ఇనుప కడ్డీలు పెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురిచేశారంటూ స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా FTL పేరుతో తమపై ఒత్తిడి తేవడం అన్యాయం అని వారు వేదన వ్యక్తం చేశారు. స్థితిగతులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇళ్లపై చేసిన…
Story Board: కొందరు ఆరంభశూరులుంటారు. ఇంకొందరు ప్రారంభించి..మధ్యలో వదిలేస్తారు. మరికొందరు మాత్రం మాటల్లో కాదు…చేతల్లో చేసి చూపిస్తారు. మూడోరకమే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. చెప్పింది చేసి చూపిస్తోంది. ఎన్నికలు ముందు అలవికానీ హామీలిచ్చినా…ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా…వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుకంజ వేయలేదు. రైతులకు రుణమాఫీ చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. భారీగా ఉద్యోగాలు కల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వర్షం వస్తే…హైదరాబాద్‌లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అడుగు తీసి…
హైదరాబాద్‌లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.
HYDRA: వర్షాల వేళ.. నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నదీ పరీవాహకం కంటే.. ఎక్కువ కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
HYDRA : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమిత నిర్మాణాలను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. మొదటగా కూకట్‌పల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ధర్మయుద్ధం ప్రారంభించారు. సర్వే నంబర్ 145లో ఉన్న 9 ఎకరాల లేఅవుట్‌ను అన్‌రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆధారంగా ఆక్రమించారని, స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మొత్తం 79 ప్లాట్లు, వాటికి సంబంధించిన పార్కులు, రహదారులు…
HYDRAA: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన స్పష్టమైన ప్రకటన కూడా చేశామని తెలిపారు.
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్‌ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్…
AV Ranganath : ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఈ కేసును దర్యాప్తు చేసిన నల్గొండ జిల్లా మాజీ ఎస్పీ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది నిందితులకు కోర్టు శిక్ష విధించడంతో, తాము చేసిన దర్యాప్తుపై గర్వంగా ఉన్నామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో దర్యాప్తును అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించామని రంగనాథ్ తెలిపారు. దాదాపు ఏడు…
AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్‌పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలను హైడ్రా డీఆర్ఎఫ్ (Hydra DRF) బృందం , ఫైర్ సిబ్బందితో చర్చించారు. డ్యూక్స్ అవెన్యూ భవనంలో…
గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్! తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు…