Chain snatcher: హైదరాబాద్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు హడలెత్తిస్తున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి తెస్తూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని నిఘాలు పెట్టినా దొరకకుండా పట్టుకోండి చూద్దాం అన్నట్లు సవాల్ చేస్తున్నారు. తాజాగా నగరంలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే చైన్ స్నాచింగ్ జరిగింది. గోకుల్ నగర్ బస్తీలో విజయ్ కుమారి అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి చైన్ స్నాచింగ్‌కు పాల్పపడ్డాడు.
Read Also: Sanitizer : చిన్నారి ప్రాణం తీసిన శానిటైజర్.. హైదరాబాదులో విషాదం
అనంతరం నిందితుడు ఆమెపై దాడికి పాల్పడి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు దొంగలించి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా గోకుల్ నగరంలో కలకలం రేపుతోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎలా వచ్చాడు..ఎలా వెళ్లాడు.. అనేది సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్ని ప్రత్యేక టీమ్‌లు పెట్టినా కానీ దుండగుల చైన్ స్నాచింగ్ మాత్రం ఆగడం లేదు.
Read Also: Kurnool Mlc Seat: హాట్ హాట్ గా మారిన కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ