Kurnool Mlc Seat: హాట్ హాట్ గా మారిన కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి తారస్థాయికి చేరుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ నానా తిప్పలు పడుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ మేరకు రంగంలోకి దిగారు. శనివారం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వైసీపీ సమన్వయకర్తలు కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంసుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు.
Read Also:Fire In Bus : సూర్యాపేట జిల్లాలో తప్పిన ప్రమాదం.. రెండు బస్సులు బుగ్గి
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ఈ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఎ.మధుసూదన్, టీడీపీ సహకారంతో ఏపీ సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నర్ల మోహన్‌రెడ్డిలు స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. కె.శ్రీనివాసులును ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన బేతంచర్లకు చెందిన ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లను అర్థరాత్రి బలవంతంగా తీసుకెళ్లి.. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని రిటర్నింగ్ అధికారి, జేసీ రామ్‌సుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేయించడంతో ఆయన నామినేషన్‌ను పరిశీలనలోనే తిరష్కరించారు. కేసు నమోదు చేస్తామని ప్రకటించారు. ముందు మద్దతు ఇచ్చి తర్వాత ఫోర్జరీ చేయించారనడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
భూమా వేణుగోపాల్‌రెడ్డి, నర్ల మోహన్‌రెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. విత్‌డ్రాకు 27వ తేదీ వరకు గడువు ఉండడంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవం కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. ఇద్దరితో విత్‌డ్రా చేయించాలని ఎమ్మెల్యేలకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహ రచనపైనా చర్చించినట్లు సమాచారం. వైసీపీ నాయకులు కలిసి మెలిసి ముందుకెళ్లాలని లేదంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రులు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్‌ఖాన్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకాలేదు.
Read Also: Pakistan: పాక్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్‌పై కాల్పులు..
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!