Sanitizer : కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు శానిటైజర్ బాటిల్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరం అయిపోయింది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం తప్పసరిగా మారింది. అయితే, శానిటైజర్ వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.. తాజాగా.. ఆ మధ్య పదేళ్ల బాలుడు తమిళనాడులో శానిటైజర్ కారణంగా మంటలు అంటుకొని బలయ్యారు. సరిగ్గా అలాగే హైదరాబాదులో నాలుగేళ్ల చిన్నారి కూడా కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన శనివారం కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Read Also: Maoists Letter : యుద్ధ వాతావరణం తెచ్చిన ప్రభుత్వం.. కూలీలను అరెస్ట్ చేస్తున్నారు
పోలీసులు తెలిపిన వివరాలు.. అంబర్‌పేట 6 నెంబర్‌లో నివాసం ఉంటున్న జగనాథం, రాజేశ్వరీ దంపతులకు అక్షర, ప్రీతి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజేశ్వరీ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణానగర్‌లోని తన పుట్టింటికి వచ్చింది. శనివారం రాజేశ్వరీ ఇంట్లో నిద్రిస్తుండగా అక్కాచెలెళ్లు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒంటికి శానిటైజర్ రాసుకున్న ప్రీతి ఆడుకుంటూ సమీప ప్రాంతంలోని దేవుడి వద్ద వెలుగుతున్న దీపం దగ్గరికి వెళ్లడంతో మంటలంటుకున్నాయి. దీనిని గుర్తించిన ప్రీతి అక్క అక్షర కేకలు వేయడంతో నిద్ర నుంచి లేచిన తల్లి రాజేశ్వరీ నీళ్లు చల్లి మంటలు ఆర్పివేసింది. హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ప్రీతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Read Also : Cyber Fraud: అక్షరం మార్చి అక్షరాల కోటి రూపాయలు కొట్టేశారు