సమాజాన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని మర్డర్ చేసి ప్లాస్టిక్ సంచిలో తీసుకొచ్చి ఇంటిముందు పడేసిన సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన సురేష్(27) రెణుక దంపతులు బ్రతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చి జీడిమెట్ల పియస్ పరిధి సంజయ్ గాంధీ నగర్ లోని ఓ రూము అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సురేష్ అటో డ్రైవర్. తరచూ భార్యభర్తల మధ్య డబ్బుకోసం గొడవలు జరుతుండేవని బంధువు సాయి తెలిపాడు.
ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను చంపి ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఇంటిముందు పడేసి వెళ్ళారని భార్య రేణుక జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. భర్త శవంను అటోలో పియస్ కు తీసుకొచ్చి ఫిర్యాదు చేసింది. మృతుని తలపై గాయాలు ఉన్నాయి. పోలీసులు మృత దేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా రేణుక పోస్ట్ మార్టం వద్దని అభ్యంతరం చెప్పింది. పోలీసులకు భార్య, ఆమె బంధువులపై అనుమానం వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భర్తని తనే హత్యచేసి దుండగుల పేరు చెబుతోందా? ఈ దారుణానికి కారణాలు ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: Naveen Reddy Atluri: సినీ హీరో నవీన్ రెడ్డి అరెస్ట్.. నమ్మించి నట్టేట ముంచాడు
పహాడీషరీఫ్‌లో దారుణం
పహాడీషరీఫ్‌లో దారుణం జరిగింది. భార్య ఫిర్యాదుతో భర్తపై ట్రిపుల్ తలాక్ కేసు నమోదు చేశారు. తన భర్త మరో మహిళతో చనువుగా ఉండటంతో భర్తను నిలదీసింది భార్య నహీదా.. భర్తను నిలదీసినందుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు భర్త రహీముద్దీన్. నహీదా ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు, రిమాండ్‌కు తరలించారు.