ప్రభుత్వ స్థలాలు, చెరువులు,నాళాలు, బఫర్ జోన్ లోని స్థలాలు కబ్జాల బారి నుంచి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా చర్యలతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైడ్రా స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్ కు చెందిన పార్కును కాపాడింది.…
Hyderabad: బుద్ధిగా చదువుకోమని చెప్పడమే తల్లి అంజలి చేసిన నేరమైంది..!! కూతురు తేజశ్రీకి మాత్రం తల్లి చేష్టలు మరోలా అర్థమయ్యాయి !! మొదటి భర్తకు పుట్టిన కూతురును కాబట్టే నన్ను పట్టించుకోవడం లేదని, రెండో భర్త కూతురైన తన చల్లిపైనే ప్రేమ చూపిస్తోందని అనుకుంది తేజశ్రీ.
తల్లి కష్టం నూటికి నూరుపాల్లు కన్న కూతురే అర్థం చేసుకోగలదు. ఎందుకంటే తానూ ఆడదే కాబట్టి !! అందులోనూ తండ్రి లేని కూతురు కాబట్టి... తల్లి తమను ఎంత కష్టపడి పెంచిందో తనకు మాత్రమే తెలుసు. అలాంటి కూతురు కన్నతల్లి పాలిట శాపంగా మారింది. ఇద్దరు కుర్రాళ్లతో కలిసి తల్లిసి హత్య చేసింది. అంజలి పెద్ద కూతురు తేజశ్రీ... ఇటీవలే తొమ్మదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో అడుగుపెట్టింది.
Crime News: బిడ్డ కంట్లో నలుసు పడినా.. ఆ కన్నతల్లి గుండె తల్లడిల్లింది ! తాను పస్తులున్నా సరే.. బిడ్డ ఆకలి తీర్చేందుకు ఎంత కష్టాన్నైనా భరించింది ! తండ్రి లేని లోటు రానివ్వకుండా రెక్కల కష్టంతో బిడ్డలను కంటికిరెప్పలా చూసుకుంది.. కానీ ఆ తల్లికి అర్థం కాలేదు.. తాను పాలుపోసి పెంచుతోంది ఓ విషనాగును అని !! కన్న తల్లిని కర్కషంగా హతమార్చింది
Jeedimetla: జీడిమెట్లలో కలకలం రేపిన తల్లి, పిల్లల మరణ ఘటనపై తాజాగా కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కరోనా తర్వాత తేజస్విని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్లిన తర్వాత, పిల్లలు స్కూల్‌కు వెళ్లాక తేజస్విని ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడడంతో.. ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తేజస్విని తన తల్లితో ఫోన్‌లో మాట్లాడింది.…
Hit And Run Case: హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. జగద్గీరిగుట్ట, షాపూర్ లలో వరుస రోడ్డు ప్రమాదాలు చేసిన కారు.. జగద్గీరి గుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా కారు వెళ్లిపోయింది.
Hyderabad: హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
Fire Accident: జీడిమెట్ల ధూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. తాజాగా హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన కార్మికుడు అనిల్ కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి..
Jeedimetla Accident: మద్యం మత్తు.. అతివేగం, అజాగ్రత్త.. పలువురి ప్రాణాలను తీస్తోంది.. కొందరి వికృత చేష్టలతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా..