Actor Naveen Reddy Atluri Arrested in Fraud Case: సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఎన్‌స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్.. సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సుమారు రూ. 55 కోట్లు మోసం చేసినట్లు తేలింది. ఇది గ్రమించిన ఎన్‌స్క్వేర్ డైరెక్టర్లు, బాధితులు.. సీసీఎస్‌లో పిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నవీన్‌పై సెక్షన్లు 420, 465, 468, 471 r/w 34 ఐసీపీ కింద కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో నవీన్ మోసానికి పాల్పడింది నిజమేనని తేలడంతో.. అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
Shehbaz Sharif: భారత్‌కి పాక్ ప్రధాని బెదిరింపు.. పాదాల కింద నలిపేస్తాడట!
తాను హీరోగా తెరంగేట్రం చేసేందుకు నవీన్ రెడ్ది ఆ కంపెనీ ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్టు తేలింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజులగూడెంకు చెందిన నవీన్.. ఇండస్ట్రీలో హీరోగా రాణించాలని కలలు కన్నాడు. అందుకు ఈ దొంగ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. తాను తాకట్టు పెట్టిన ఆ కంపెనీ ఆస్తులతోనే ‘నోబడీ’ పేరుతో హీరోగా సినిమా చేశాడు. ఇక మిగిలిన డబ్బులతో తన స్నేహితులతో కలిసి జల్సాలు చేశాడు. ఈ ఒక్క ఫ్రాడ్ కేసు మాత్రమే కాదు.. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు, ఈ కేసు విచారణలో భాగంగా నవీన్ రెడ్డి బాగోతం బట్టబయలైంది. గతంలో అతనిపై బైక్ దొంగతనం కేసులు ఉన్నట్టు వెల్లడైంది. ట్యాలెంట్‌ని నమ్ముకోకుండా ఇలా అడ్డదారులు దొక్కితే.. పరిణామం ఇలాగే ఉంటుంది మరి!
Ponnam Prabhakar: రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను కేసీఆర్ బలి చేస్తున్నారు
అన్నట్టు.. నవీన్ రెడ్డి చేసిన ‘నోబడీ’ సినిమా పరిస్థితి ఏంటన్నది క్లారిటీ లేదు. అప్పుడెప్పుడు ఒక టీజర్‌ని అయితే విడుదల చేశారు. దాన్ని చూస్తే, ఇదొక త్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. అంతేకాదు.. అందులో ఎన్‌స్క్వేర్ సంస్థే ఈ సినిమాని నిర్మించిందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే.. సంస్థ వాళ్లను నమ్మించి, అతడు టోకరా వేశాడని తెలుస్తోంది. నిర్మాణంలో భాగస్వామ్యం చేసుకున్నట్టే చేసుకొని, వెనకాల నుంచి డబ్బులు దోచేశాడన్నమాట!