Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంటిపై మంటలు వ్యాపిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఓ వ్యక్తి వంద మీటర్లు పరుగు తీసాడు.. అతనికి ఏమో కానీ చూసేవారికి వణుకు పుట్టింది.. ఆ ధైర్య సాహసాలకు మెచ్చిన గిన్నిస్ బుక్ అధికారులు అతనికి గిన్నిస్ లో చోటు ఇచ్చారు.. అతను చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నా.. మరి కొందరు అతని ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు.. ఆ వ్యక్తికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
విషయానికొస్తే.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జోనాథన్ వెరో ఒక ప్రొఫెషనల్ స్టంట్ మ్యాన్. చిన్నప్పటి నుంచి మంటలు అంటే ఇష్టమట. అగ్నితో ఆటలు ఆడాడట. ఫైర్ ఫైటర్‌గా ఫైర్ షోలలో మంటలను ఆర్పడం, మంటలను మింగడం వంటివి చేస్తూ ప్రేక్షకుల్ని అలరించేవాడట. ఇవన్నీ అతను ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికి సహకరించాయి..ఆక్సిజన్ లేకుండా ఒంటిపై మంటలు మండుతుంటే అత్యంత వేగంగా 100 మీటర్లు 17 సెకండ్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు జోనాథన్ వెరో. ఈ రికార్డ్‌కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది..
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ఈ వీడియోను చూసిన నెటిజన్లుభిన్నంగా స్పందించారు. ‘అలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు ఉన్నాయి’ అని ఒకరు.. ‘ఇది రికార్డు ఎలా అవుతుంది?’ అని మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రాణాలకు ప్రమాదకరమైన ఫీట్లు రికార్డులలోకి ఎలా తీసుకుంటున్నారని చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైన అతని ధైర్యానికి మెచ్చుకొని చాలా మంది అతన్ని రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లతో దూసుపోతుంది.. ఒకసారి ఆ ఒళ్ళు గగూర్పొడిచే వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి.. నిజంగా ఇటువంటి సాహసాలు చెయ్యాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. మీ డేర్ కు హ్యాట్సాప్..
New record: The fastest full body burn 100 m sprint without oxygen – 17 seconds by Jonathan Vero (France)
Jonathan also set the record for the farthest distance ran in full body burn during this attempt at 272.25 metres! 🔥 pic.twitter.com/J0QJsPNkPf
— Guinness World Records (@GWR) June 29, 2023
తాజావార్తలు
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?