ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
జూన్లో కార్ల విక్రయ గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) విడుదల చేసింది. సియామ్ (SIAM) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2024 జూన్లో భారత మార్కెట్‌లో PV విభాగంలో (హోల్‌సేల్) 3.37 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే గతేడాది జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో.. బెంగళూరు నగరానికి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే.. బీభత్సమైన వర్షం కురిసింది. ఈ క్రమంలో.. జూన్‌లో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
కర్ణాటకలో జూన్ 1 నుంచి 5 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల ఫలితాల కారణంగా జూన్ మొదటి వారంలో కనీసం ఐదు రోజుల పాటు కర్ణాటకలో మద్యం అమ్మకాలు నిషేధించారు. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ఓటింగ్, జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో.. జూన్ 1 నుంచి 4 వరకు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. శాసన మండలి ఎన్నికల ఓట్ల…
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
GST Collections: దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెలకు గానూ రూ.1,61,497 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు తెలిపింది. Read Also: Semiconductor: ఇండియాకు క్యూ కడుతున్న చిప్ కంపెనీలు.. ఒడిశాలో యూనిట్ పెట్టేందుకు యూకే సంస్థ ప్లాన్.. గతేడాది జూన్‌లో రూ.1.44…
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కలిగినవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వచ్చే నెల నుంచి రాగులను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.. రాయలసీమలోని కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని సోమవారం ఓ…
Minister Harishrao: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్తీ దవాఖానల ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. జూన్ నాటికి పట్టణాల్లో 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇక శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు…అంటున్నారు పురోహితులు. అవును మరి…వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ముహూర్తాలు ఉండవట. అందుకే తల్లిదండ్రులు హడావుడి…
గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, బిహార్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గడం కొంత ఊరటనిస్తోంది. రికవరీ రేటు కూడా పెరగడంతో కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు వచ్చినట్లుగా అంతా భావిస్తున్నారు. అయితే కరోనా మరణాల విషయంలో చాలా రాష్ట్రాలు నిజాలు దాస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా టెస్టులు కూడా తక్కువగా చేయడం…