Chitra Shukla: ఈ ఏడాది చివర్లో సగానికి పైగా స్టార్లు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే వరుణ్ తేజ్- లావణ్య తమ ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఇక రేపు దగ్గుబాటి అభిరామ్- ప్రత్యూష పెళ్లితో ఒకటి కానున్నారు. తాజాగా వీరి లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది. పులి, నేను శైలజ లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి.. మా అబ్బాయి మూవీతో హీరోయిన్ గా మారింది చిత్ర శుక్లా. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేనప్పటికీ చిత్రాకు మాత్రం వరుస అవకాశాలే అందించింది. రాజ్ తరుణ్ నటించిన రంగులరాట్నం సినిమాతో చిత్ర కొద్దోగొప్పో పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
Prabhas: గురువుకు రోలెక్స్ గిఫ్ట్ ఇచ్చిన డార్లింగ్..
గత కొన్ని రోజులుగా చిత్ర, వైభవ్ ఉపాధ్యాయ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతను మధ్యప్రదేశ్ లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. దీంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ ఆమె అధికారికంగా తమ పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. డిసెంబర్ 8న తమ వివాహం జరగనున్నట్లు ఆమె తెలిపింది. ఇప్పటికే మెహిందీ, హల్దీ ఫంక్షన్ కూడా జరిగాయని తెలుపుతూ వారి ఎంగేజ్మెంట్ ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ చిన్నది పెళ్లి తర్వాత నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.