తెలంగాణలో సీఎం ఎంపిక పూర్తైంది. ఇక, మంత్రివర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం నజర్ పెట్టింది. ఏఐసీసీ నేతలు రేవంత్ రెడ్డితో చర్చించి మంత్రివర్గం ఖరారు చేయనున్నారు. అయితే, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి.. ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. మూడు రోజులుగా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి.. ఎవరిని సీఎం చేస్తే బాగుంటుందని అభిప్రాయ సేకరణ చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. కాంగ్రెస్ అధిష్టానికి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సమర్పించారు. ఇక, అభిప్రాయలను పరిశీలించిన తర్వాత సీఎల్పీ నేతను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ సీఎల్పీ నేతగా, సీఎంగా రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించారు.
Read Also: Chitra Shukla: పెళ్లి పీటలు ఎక్కుతున్న రాజ్ తరుణ్ హీరోయిన్
ఇక, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం అభ్యర్థిగా రేవంత్ ను ప్రకటించిన వెంటన మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీ కాంగ్రస్ నేతలు ఉన్నారు. కేబినెట్ లో ఎవరిని తీసుకోవాలి.. ఎవరికి ఏ పదవి కేటాయించాలనే దానిపై రేవంత్ రెడ్డి తో చర్చిస్తు్న్నారు. ఈ చర్చల తర్వాత డిసెంబర్ 7న జరిగే ప్రమాణ స్వీకారం లోపు పూర్తి స్థాయి కేబినెట్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఢిల్లీ హైకమాండ్ దగ్గర లాబీయింగ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా ఉన్నారు.
Read Also: Geetika Koul: తొలిసారిగా సియాచిన్లోని భారత సైన్యానికి మహిళా డాక్టర్ ఎంపిక
అయితే, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మాణిక్ రావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, తదితర నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ పెద్దలను నేరుగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రకటన వెలువడిన మరుక్షణమే ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీస్ భద్రతను పెంచారు.