WTC FINAL 2023: లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఇండియా – ఆసీస్ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ పైనే అన్నీ ఆశలున్నాయి. (ఇవాళ) నాలుగో రోజున మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ఉండబోతుంది. మ్యాచ్ తొలి రోజు నుంచి మంచి ఎడ్జ్ సాధించిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Read Also: AAP: ఈసారి మోడీ గెలిస్తే “నరేంద్ర పుతిన్” అవుతాడు.. సీఎం హెచ్చరిక..
లక్ష్యచేధనలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్లు (నిన్న) శనివారం 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(43), గిల్ (18), పుజారా (27) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి దిగన విరాట్ కోహ్లీ(44), అజింక్యా రహానే (20) పరుగులు చేశారు. అయితే ఈరోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. టీమిండియా విజయం సాధించాలంటే 280 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఈసారైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కప్ గెలవాలని భారత్ ఊవిళ్లూరుతుంది. చూడాలీ మరి కప్ ను అందుకుంటారో, డీలా పడిపోతారో ఈరోజు తేలిపోనుంది.
Read Also: AICC Sampath Kumar : కేసీఆర్ మీరు అలంపూర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి
ఈరోజు మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఇప్పటికే 44 పరుగులు చేసి.. క్రీజులో ఉన్న కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల ఆశలు ఉన్నాయి. ఈ ఏడాదంతా మంచి ఫాం కనబరుస్తున్న కోహ్లీ.. అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. మరోవైపు మొన్నటికి మొన్న ఐపీఎల్ లో సెంచరీల మోత కూడా మోగించాడు. అలాంటి మంచి ఫాంలో ఉన్న కోహ్లీ పైనే.. ఈ మ్యాచ్ ఆధారపడి ఉంది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో 90 ఓవర్లు ఉన్నాయి. టీమిండియా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో.