భారత్ లో పర్యటనకు ముందు ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కమిన్స్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ కమిన్స్ గాయంతోనే సిరీస్ ఆడాడు. దానివల్ల అతనికి నొప్పి ఎక్కువ కావడంతో.. కీలకమైన వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని, భారత్ లో జరిగే వన్డే సిరీస్ కు కమిన్స్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది. మ్యాచ్‌లో మూడో రోజు టామీ ఈ ఘనత సాధించింది. టెస్ట్‌ల్లో ఆమెకు మొదటి డబుల్ సెంచరీ కాగా.. టెస్ట్‌ల్లో ఇంగ్లీష్ మహిళా బ్యాట్స్‌మెన్ సాధించిన మొదటి డబుల్ సెంచరీ.
444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఐదో రోజు తొలి సెషన్ లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు టీమిండియా గెలువాలంటే 280 పరుగులు కావాలి. అందుకు ఆస్ట్రేలియా గెలువాలంటే 7 వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్, బౌలింగ్ బలాబలాల్లో గెలుపు ఆసీస్ నే వరించింది. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు.
ఈరోజు మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఇప్పటికే 44 పరుగులు చేసి.. క్రీజులో ఉన్న కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల ఆశలు ఉన్నాయి. ఈ ఏడాదంతా మంచి ఫాం కనబరుస్తున్న కోహ్లీ.. అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.
కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు.
మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫుల్ ఫాంలో ఉన్న గిల్.. ఇప్పుడేమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఐపీఎల్ లోనే కాకుండా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో.. మూడు ఫార్మట్లలో బాగానే ఆడాడు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీల బాదాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ అయితే ఏకంగా 3 సెంచరీలు కొట్టి మంచి ఫాంలో ఉన్న గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. దీంతో ఏడాది కాలమంతా…
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది.
టీమిండియా బ్యాటర్లను ఇబ్బందిపెట్టేందుకు ఆసీస్ ప్రణాళికలు రచించుకున్నారు. అందుకు సంబంధించి ఆసీస్.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫైనల్ బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెప్పాడు. ఇక ఈ ముగ్గురిలో తనతో పాటు, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలండ్ ఉన్నారని తెలిపాడు.