జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. రేపు కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభోత్సవానికి వస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతమన్నారు. జిల్లా ప్రజలకు 9 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పి జిల్లాలో అడుగు పెట్టాలన్నారు. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న కేసీఆర్ మీరు అలంపూర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
Also Read : Vignesh : నయన్ కు అదిరిపోయే సర్ప్రైస్ ఇచ్చిన విగ్నేష్..
అంతేకాకుండా.. ‘ఆర్ డి ఎస్ ఆయకట్టుకు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తా అన్నావ్.. అలంపూర్లో డిగ్రీ కాలేజ్.. మినీ బస్ డిపో, ఫైర్ స్టేషన్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేస్తాం అన్న మాటలు ఏమయ్యాయి.. అలంపూర్ ఆలయాల అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్నావు కానీ వంద రూపాయలు ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం లో 90 శాతం పూర్తయిన నెట్టెంపాడు ప్రాజెక్టు తెలంగాణ వచ్చాక ఒక్క అడుగు ముందుకు పడలే సమస్యలపై స్వయంగా ఎలక్షన్లు మరియు పుష్కరాల సమయంలో ఇచ్చిన హామీలపై మీడియా ముఖంగా కేసీఆర్ మాట్లాడిన మాటలను మీడియా సమావేశంలో చూపించారు.
Also Read : Purandeswari: జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయి.. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు..
వీటిని విశ్లేషించుకొని రేపు జరిగే బహిరంగ సభలో అలంపూర్ ప్రజలకు సమాధానం చెప్పాలి.. పై సమస్యలపై మాట్లాడేందుకు ఒక్కొక్క రంగానికి చెందిన ఐదు మంది వ్యక్తులకు సీఎం కేసీఆర్ కు వినతి పత్రం ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ ను అనుమతి కోరాం.. ఒక వేళ అనుమతి నిరాకరిస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.’ అని ఆయన అన్నారు.