అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే.. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా కేసు విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ కేసుపై హైకోర్టులో రేపు విచారణ జరుగనుంది. హైదరాబాద్ అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తాలో ఆడుకుంటున్న నాలుగేళ్ల ప్రదీప్ ను వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడి ప్రదీప్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. ప్రదీప్ తండ్రి గంగాధర్ నిజామాబాద్‌కు చెందిన వాడు. అయితే.. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి బాగ్‌అంబర్‌పేట డివిజన్ ఎరుకల బస్తీలో ఉంటూ ఛే నంబర్ చౌరస్తాలోని రెనాల్డ్ కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
Also Read : CM YS Jagan and New Governor Relationship: కొత్త గవర్నర్‌తో సీఎం జగన్ సంబంధాలు ఎలా ఉంటాయో..?
అయితే.. గంగాధర్‌కు ప్రదీప్‌తో పాటు కుమార్తె మేఘన (6) ఉంది. ఆదివారం పిల్లలను తీసుకుని సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లాడు గంగాధర్. మేఘనను పార్కింగ్ సెక్యూరిటీ క్యాబిన్‌లో ఉంచి ప్రదీప్‌ను సర్వీసింగ్ సెంటర్‌లోకి తీసుకెళ్లాడు. అయితే, బాలుడు కొద్దిసేపటికి అక్క వద్దకు వస్తుండగా కార్ల కింద ఉన్న నాలుగు కుక్కలు దాడి చేయడంతో పడిపోయిన అతడిని తల, చేతులు, కాళ్లు, మెడ, పొట్ట భాగంలో తీవ్రంగా కరిచాయి. అయితే.. ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కార్ల సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.50 వేలు ఇవ్వడంతో గంగాధర్ కుటుంబం ఇందల్‌వాయికి వెళ్లి.. ప్రదీప్ అంత్యక్రియలు నిర్వహించింది.
Also Read : Pakistan: తప్పుదోవ పట్టిస్తున్న పాకిస్థాన్.. హిజ్బుల్ కమాండర్ అంత్యక్రియల్లో హిజ్బుల్ చీఫ్ ప్రత్యక్షం