చాలా మంది యువత ఉపాధి కోసమనో.. లేదంటే చదువుల కోసమనో విదేశాలకు వెళ్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా వారిని విదేశాలకు పంపించడంలో వెనుకాడటం లేదు. లక్షలు లక్షలు ఖర్చు చేసి మరీ పంపిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువత గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గత నెల రోజులుగా విదేశాలకు వెళ్లే యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.
Gujarat CM Bupendra Ptel: ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
గత నెల రోజులుగా ఐదుగురు యువకులు గుండెపోటుతో మరణించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరందరి వయసు 17 నుంచి 26 ఏళ్ల మధ్య గలవారే. జూలై 28న – బటిండా నివాసి గగన్‌దీప్ సింగ్ (22) గుండెపోటుతో మరణించాడు. అతను గతేడాది ఆగస్టు 8న కెనడా వెళ్లాడు. జూలై 26న – బర్నాలా జిల్లాకు చెందిన జగ్జిత్ సింగ్ అనే 17 ఏళ్ల యువకుడు కెనడాలో గుండెపోటుతో మరణించాడు. జూలై 20న – గురుదాస్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు రజత్ మెహ్రా కెనడాలో గుండెపోటుతో మరణించాడు. 23 రోజుల క్రితం కెనడా వెళ్లాడు. జూలై 17న – జలాలాబాద్ నివాసి 26 ఏళ్ల సంజయ్ కెనడాలో గుండెపోటుతో మరణించాడు. మూడేళ్ల క్రితం వెళ్లాడు. జూలై 4న- గురుదాస్‌పూర్ నివాసి కన్వర్జిత్ సింగ్ (24) న్యూజిలాండ్‌లో గుండెపోటుతో మరణించాడు. జూన్ 11న- అమృత్‌సర్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల తరణ్‌వీర్ సింగ్ కెనడాలో అనుమానాస్పద పరిస్థితులలో మరణించాడు. ఆయన మృతికి గుండెపోటు కూడా కారణమని చెబుతున్నారు.
SJ Suryah: శ్రీదేవి తరువాత ఆమెనే.. పవన్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
యువకులు ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు అనే దానికి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులే ప్రధాన కారణమంటున్నారు.
భారతదేశంలో వాతావరనం విదేశంలో వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. మృతిచెందిన యువకులు భారతదేశంలోని వేడి వాతావరణంలో కొన్ని సంవత్సరాలు నివసించారు. విదేశాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. వాతావరణంలో మార్పుల కారణంగా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది నేరుగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగడంతో.. వ్యక్తి మరణిస్తాడు.
TSRTC: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన నిర్ణయం హర్షదాయకం
విదేశాలకు వెళ్లే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
విదేశాలకు వెళ్లే విద్యార్థులు భారతదేశాన్ని విడిచిపెట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవెంటంటే.. విదేశాల్లో వాతావరణం శరీరంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే ముందు వైద్యుల వద్ద అవసరమైన ఆరోగ్య సలహాలు తీసుకోండి. విదేశాలకు చేరుకున్న తర్వాత మెల్లగా అక్కడి వాతావరణానికి అలవాటు పడండి. విదేశాలకు చేరుకోవడానికి ముందు కనీసం 5-6 నెలల పాటు జిమ్‌లో చేరడం లేదా హెవీ వర్కవుట్ చేయడం మానుకోండి. సప్లిమెంట్లను అస్సలు ఉపయోగించవద్దు. ఫాస్ట్ ఫుడ్, వేయించిన వస్తువులు మరియు శీతల పానీయాలకు దూరంగా ఉండండి. వేడి ఆహారం తిన్న వెంటనే చల్లటి నీరు తాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.