కేటీఆర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి. నిన్న సాయంత్రం ఏసీబీకి 5:30కు ఫిర్యాదు అందింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ MAUD ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం విచారణ చేయగా అవకతవకలు బయటపడ్డాయి.
సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్, వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.. పోలీసులు. ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి కాన్వాయ్ తో బయలుదేరారు.…
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. దీంతో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి..
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం, నకిలీ వైద్య వ్యవస్థ ద్వారా వైద్య పరంగా.. ఎటువంటి విద్యార్హత లేకుండా పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తున్న వచ్చి రాని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులను గుర్తించి NMC చట్టం ప్రకారం తెలంగాణ వైద్య మండలి అధికారులు కేసులు నమోదు చేశారు.
పాకిస్థాన్ (Pakistan) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీలు ఎవరికి వారే విజయం సాధించామంటూ చెప్పుకుంటున్నారు.
హైదరాబాద్ లో వీధికుక్కలు వీర విహారం సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న వీధి కుక్కల దాడిలో ఓ పసిబాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. కొన్ని చోట్ల మనుషులపై ఎగబడి దాడికి పాల్పడుతున్నాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రపంచాన్ని వణికిస్తోంది. కేరళలో తిష్ట వేసిన వెరియంట్ అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది. తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇంకా 42 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కరోనా కేసులు హైదరాబాద్ లోనే వెలుగుచూశాయని…
తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమీషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. అంతేకాకుండా.. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో.. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను…