Satya Kumar Yadav: రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన సుపరిపాలన యాత్రలో శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వాజపేయి పాలన భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేసిందని, ఆయన చూపిన దిశలోనే నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ఈ సందర్బంగా ఆయన అన్నారు. వాజపేయి నాయకత్వం దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపినదే కాకుండా, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, ఐటీ, టెలికాం కనెక్టివిటీ వంటి కీలక రంగాలలో విప్లవాత్మక…
రాష్ట్రంలో డ్రగ్స్ పైన నిఘా పెట్టాలని, ఈగల్ ఉందని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆగాల్సిన పని లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ పని చేయనివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయని, తనకే అలాంటి పరిస్ధితి ఎదురైందన్నారు. ఎక్స్‌పైరీ మందులు, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జనరిక్, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారని సత్యకుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి,…
Fake TTD Letters: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్ల జారీపై విజయవాడ నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Cyclone Alert: తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా ప్రామాణిక నిర్వహణ విధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్) రూపొందించింది. తుపాన్ రాకముందు వైద్య సేవలు అందించేందుకు ఆసునతులవారీగా సంసిద్ధత ఎలా ఉండాలి? వచ్చినప్పుడు వైద్యులు ఎలా స్పందించాలి? అనంతరం వ్యాధులు ప్రజలకుండా, పునరావాస, ఇతర చర్యలు జిల్లా స్దాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలన్న దాని గురించి 7 పేజీల్లో వైద్య శాఖ వివరించింది. రాష్ట్రానికి మొంథా’…
మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డికి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా.. గునపాలు దిగుతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. పోనీలే అని ఊరుకుంటున్నాం అని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే ఒక్కరు కూడా ఊళ్లో ఉండలేరన్నారు. ఎవరైనా ప్రజల జోలికి వస్తానంటే తాటతీస్తాం అంటూ మంత్రి సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేతి…
Satya Kumar Yadav: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. నేడు జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంపై ఆయన స్పందిస్తూ.. ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. కర్నూలు జీజీహెచ్ (ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి) సూపరింటెండెంట్‌ను కూడా అలెర్ట్ చేసినట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు. Minister Narayana:…
ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జన్యుపరంగా, వారసత్వంగా వస్తున్న వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం అని అన్నారు. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందన్నారు. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేషన్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఈరోజు విజయవాడలో మంత్రి సత్యకుమార్…
నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని, నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసిందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ కలగలిపితేనే నర్సు అని.. పవిత్రమైన వృత్తి నర్సింగ్‌ని ఎంచుకున్న అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. ఏపీలో నర్సింగ్ కౌన్సిల్‌లో 1.20 వేల మంది రాష్ట్ర విభజన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయని, నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తాం…
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులను పీపీపీ మోడ్‌లో నిర్మిస్తాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. నందిగామలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ అంశంపై…