Kangana Ranaut: తొలి నుంచి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. ఇక, తన సినిమాను వీక్షించేందుకు రాహుల్‌ను ఆహ్వానించేందుకు వెళ్లగా.. ఆయన అంత మర్యాదగా వ్యవహరించలేదని ఆమె తెలిపింది. కానీ, ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం కంగనా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమెను కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించారని చెప్పుకొచ్చింది. ఆ సంభాషణ నాకు గుర్తుండిపోతుంది.. ప్రియాంక తన సోదరుడిలా కాదు.. చాలా తెలివైనది. ఆమెతో మాట్లాడటాన్ని నేను ఎంజాయ్ చేశానని మీడియాతో కంగనా రనౌత్ వెల్లడించారు.
Read Also: Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?
ఇక, ఇంతకుముందు కూడా ఇదే విషయంపై కంగన మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీని కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరగా, ప్రయత్నిస్తానని ఆమె బదులిచ్చారని తెలిపింది. ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలిపాం.. ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన విషయం.. ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించినట్లు చెప్పుకొచ్చింది. రీసెర్చ్ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా.. తన భర్త, పిల్లలు, స్నేహితులతో ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.. శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాన అని పేర్కొనింది. ఆ విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కంగనా చెప్పింది.
Read Also: Tirupati Stampede: బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ఎంతంటే?
కాగా, ఎమర్జెన్సీ మూవీని థియేటర్‌లో విడుదల చేయాలనుకోవడం తన పొరపాటు అని నటి కంగనా తెలిపారు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’.. ఈ మూవీలో కంగనా రనౌత్ కథానాయికగా, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. రిలీజ్ ను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ కోర్టును సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు తెలిపింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ కు సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు చేయడంతో.. వివాదాలకు దారి తీసేలా ఉన్న పలు సన్నివేశాలను తొలగించినట్లు పేర్కొన్నారు