CM Jagan: ఆర్తికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ.. పలు అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jagan Met With Nirmala Sitaraman In Delhi: శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. అక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన ఈ ఇద్దరి మధ్య.. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చలు జరిగాయి. తొలుత ఆంధ్రప్రదేశ్‌కు అందించిన సహాయానికి నిర్మలాకు కృతజ్ఞతలు తెలియజేసిన జగన్.. 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్యకాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు వంటి అంశాలపై చర్చించారు.
Pawan Kalyan: ఆయనను మర్చిపోలేం.. పవన్ ఎమోషనల్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్, రూ.6,756.92 కోట్ల బకాయిల అంశాలను సైతం ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఆయన పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ జెన్‌కో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరం ఉందని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. స్కూళ్లలో నాడు-నాడు కార్యక్రమం కింద రూ.6 వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని సీఎం తెలియజేశారు.
Vanitha Vijay Kumar: సొంతవాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు.. నా తండ్రే నన్ను
అలాగే ఆరోగ్య రంగంలోనూ నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ పనులు చేపట్టామని సీఎం జగన్ వివరించారు. ఇందుకు గాను రూ. 4వేల కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభవిష్యత్తును తీర్చిదిద్దుతాయని, వీటి కోసం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాలని ఆర్థికమంత్రిని సీఎం కోరారు. నిర్మలా సీతారామన్ సానుకూలంగానే స్పందించారని సమాచారం. కాగా.. రేపు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!