మెదక్‌లో హావేలి ఘనపూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 2014కి ముందు 2014 తర్వాత పరిస్థితి ఎలా ఉంది అన్నది మనం పరిశీలించుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పని ఈ 8 ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించారని, ఇంత మంచి పని చేసిన కేసీఆర్ ని సాదుకుందామా..సంపుకుందమా..? అని ఆయన ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పంచినోడు కావాల్నా..పెంచినోడు కావాల్నా.. అని ఆయన అన్నారు. పదో తరగతి పేపర్ లీక్ చేసిన దొంగను పోలీసులు దొరకబట్టి లోపల వేశారని, దొంగతనం చేసిన దొంగను లోపల వెయ్యకపోతే ఏం చేస్తారని ఆయన అన్నారు.
Also Read : Punjab Kings: పంజాబ్ జట్టులో కీలక మార్పు.. ఆల్‌రౌండర్ స్థానంలో అతడు
ఆనాడు నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అంటే… ఇప్పుడు నేడు నేను పోతా బిడ్డ సర్కారు దవాఖానకు అంటున్నారన్నారు. 25 తేదీ నుంచి న్యూట్రిషన్ కిట్ ఇస్తామని, బీజేపీ వాళ్ళు గరిబోళ్ళ పొట్ట గొట్టి, అదానీ, అంబానీ ఆస్తులు పెంచుతున్నారన్నారు. ఢిల్లీల ఉన్నోడు పగబట్టిండు మన మీద.. మోటర్లకు మీటర్లు పెట్టలేదని 30 కోట్లు ఆపిండని, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల్లో కాస్త వెనుక పడ్డామని, ఈ నెలలోనే మీ సొంత స్థలాల్లో ఇల్లు కట్టిస్తామన్నారు. రైతుల కోసం 30 వేల కోట్లు వద్దనుకున్నాడు సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే అని ఆయన విమర్శించారు.
Also Read : Kim Cotton: పురుషుల క్రికెట్‌లో లేడీ అంపైర్.. చరిత్రలో ఇదే తొలిసారి
కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇదంతా సాధ్యమయ్యిందని, 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అని కేసీఆర్ అంటే జానారెడ్డి అయ్యే పనేనా అన్నాడని, ఆనాడు పంటలు పండించాలంటే రైతుకు అన్ని కష్టాలే అని ఆయన గుర్తు చేశారు. ఆనాడు అన్ని తంటాలే.. ఈ నాడు ఊరి.. ఊరికి కాంటాలే అని, ఒక్క గింజ కూడా లేకుండా వడ్లు కొన్న నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. సద్ది తిన్న రేవు తలవాలని, కేంద్రాన్ని వడ్లు కొనమంటే నుకలు బుక్కమని మనల్ని అవమాన పరిచారని ఆయన మండిపడ్డారు. ఆనాడు పని లేక మనం వలస బోయినం..ఈనాడు ఇతర రాష్ట్రాల నుంచి పనులు చేయడానికి ఇక్కడకు వస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లు ఆనాడు ఎందుకు ఇవన్నీ ఇయ్యలే అని ఆయన ప్రశ్నించారు.