Gurnoor Singh Brar Replaced Raj Angad Bawa In Punjab Kings: ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందే కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. వారిలో పంజాబ్ కింగ్స్‌కి చెందిన రాజ్ అంగద్ బవా ఒకడు. ఇతడు ఓ ఆల్‌రౌండర్. గత సీజన్‌లో పంజాబ్ జట్టు తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. భుజానికి గాయం అవ్వడంతో అతడు ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో.. అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై తర్జనభర్జన అయిన ఆ జట్టు, కొందరిని పరిశీలించిన అనంతరం పంజాబ్‌కు చెందిన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గుర్నూర్ సింగ్ బ్రార్‌ను ఎంపిక చేసింది. ఇతడ్ని రూ.20 లక్షల బేస్ ధరకే సొంతం చేసుకున్న పంజాబ్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఆల్‌రౌండర్.. 2022 డిసెంబర్‌లో పంజాబ్ రాష్ట్రం తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బ్రార్.. 120.22 స్ట్రైక్ రేట్‌తో 107 పరుగులు చేయడంతో పాటు 3.80 ఎకానమీతో 7 వికెట్లు కూడా పడగొట్టాడు. మరి.. తనకొచ్చిన ఈ ఐపీఎల్ ఛాన్స్‌ని అతడు సద్వినియోగపరచుకుంటాడో లేదో చూడాలి.
Virender Sehwag: ఏంటా చెత్త బ్యాటింగ్.. యువ ప్లేయర్‌పై సెహ్వాగ్ ఘాటు విమర్శలు
కాగా.. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. వర్షం కారణంగా మ్యాచ్ ఆగింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కేకేఆర్ 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో.. అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు.
Kim Sharma: ‘ఖడ్గం’ బ్యూటీ ఎఫైర్స్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు..?