Kim Cotton becomes first woman on-field umpire in full-member men T20I: అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో సరికొత్త శకం మొదలైంది. మెన్స్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఒక మహిల అంపైర్ తొలిసారి విధులు నిర్వర్తించింది. న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్ అనే మహిళ అంపైర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్ కాటన్ ఫీల్డ్ అంపైర్‌గా రంగంలోకి దిగింది. గతంలో హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈమె థర్డ్ అంపైర్‌గా వ్యవహరించింది. కానీ.. ఈసారి ఫీల్డ్ అంపైర్‌గా అడుగుపెట్టి, పురుషుల క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలికింది.
Punjab Kings: పంజాబ్ జట్టులో కీలక మార్పు.. ఆల్‌రౌండర్ స్థానంలో అతడు
ఇదొక్కటే కాదండోయ్.. కిమ్ కాటన్ తన పేరిట చాలా రికార్డులే లిఖించుకుంది. 2020లో మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించి.. ఈ ఫీట్ నమోదు చేసిన తొలి మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మూడు మహిళల టీ20 వరల్డ్‌కప్‌లకు (2020, 2022, 2023) అంపైర్‌గా పని చేసిన కాటన్.. వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మహిళా అంపైర్లలో ఈ రికార్డ్ ఎవ్వరికీ దక్కలేదు. ఓవరాల్‌గా కిమ్ కాటన్ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుకుంటే.. 2018 నుంచి ఈమె 54 టి20 మ్యాచ్‌లు, 24 వన్డే మ్యాచ్‌లకు అంపైర్‌గా విధులు నిర్వర్తించింది.
Virender Sehwag: ఏంటా చెత్త బ్యాటింగ్.. యువ ప్లేయర్‌పై సెహ్వాగ్ ఘాటు విమర్శలు
కాగా.. న్యూజిలాండ్, శ్రీలంక టీ20 మ్యాచ్ విషయానికొస్తే.. తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై కివీస్ విజయం సాధించింది. ఫలితంగా.. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 19 ఓవర్లలోనే 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. ఇంకా 5.2 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో.. కివీలస్ అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ చాడ్ బోవ్స్ (31) కూడా ఆరంభంలో రప్ఫాడించేశాడు.