Bhuvneshwar Kumar: అయోమయంలో భువీ ఫ్యాన్స్.. టీమిండియాలో స్థానంలో లేనట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ చేసిన పని వల్ల ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో చేసిన మార్పుతో ఆయన ఫాలోవర్లను కన్ఫ్యూజన్‌లోకి తొసేశాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువీ 2012లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. పేస్ దళంలో కీలక సభ్యుడిగా జట్టుకు సేవలందించి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా ఈ సీమర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబరులో లాస్ట్ టైం భారత జట్టు తరఫున ఆడాడు.. ఇక, ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాంక్ట్ జాబితా నుంచి బీసీసీఐ భువనేశ్వర్ కుమార్ ను ఇటీవలే తొలగించింది.
Read Also: Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇక, వరుస వైఫల్యాలతో ఆసియా కప్ టీ20 టోర్నీ-2022, టీ20 ప్రపంచకప్-2022లో దారుణ ప్రదర్శన తర్వాత బీసీసీఐ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్.. దేశవాళీ క్రికెట్‌కు కూడా గత కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భువీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో ఇండియన్ క్రికెటర్‌ను ఇండియన్‌గా మార్చుకున్నాడు.. ఇది చూసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఫ్యాన్స్.. అయ్యో ఏంటీ భువీ! నువ్వు తిరిగి జట్టులోకి వస్తావు అనుకుంటే.. నీవ్వు ఇలా చేశావంటు భువీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Read Also: Viral Video: ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు పోజులిస్తుండగా జలపాతంలో జారిపడ్డాడు.. వీడియో వైరల్
అయితే, ఇదంతా చూస్తుంటే భువనేశ్వర్ కుమార్ బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడి జీవితంలో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజం.. నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి రావాలి.. ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దు ప్లీజ్ అంటూ భువీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా ఇన్‌స్టాలో ఇండియన్ క్రికెటర్ అన్న పదాలను తొలగించిన భువనేశ్వర్.. ట్విటర్‌లో మాత్రం వాటిని అలాగే కొనసాగించడం గమనార్హం. ఏదేమైనా ఈ సీనియర్ పేసర్ తను చేసిన పనికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!