చలికాలంలో జట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో వీచే చలి, గాలుల కారణంగా తల చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు. చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి. ఈ మూడు రకాల నూనెలు జుట్టు, స్కాల్ప్ రెండింటికి పోషణను అందిస్తాయి. చుండ్రు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, జుట్టు పల్చబడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. శీతాకాలంలో తగ్గుతున్న ఊష్ణోగ్రతల కారణంగా.. వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టుకు…
ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఉసిరికాయ ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
చలికాలంలో చర్మాన్ని, శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. అంతే జాగ్రత్తగా జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చల్లటి గాలి, తక్కువ తేమ, తరచుగా వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను, మెరుపును కోల్పోతుంది.
పెరుగు, కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. కలబందలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలోని తేమను లాక్ చేయడం ద్వారా పొడి చర్మం సమస్యను నివారిస్తుంది. మీరు కలబందతో కలిపిన పెరుగును ఉపయోగిస్తే.. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారుతుంది.
మీ జుట్టుకు ఎంత నూనె రాసుకుంటే జుట్టు అంత దృఢంగా మారుతుందని బామ్మలు చెప్పడాన్ని మీరు తరచుగా వినే ఉంటారు. ఈ మాట నిజం కూడా. కానీ.. ఈ రోజుల్లో జుట్టుకు నూనె రాసుకోవడమే మానేస్తున్నారు. ఎందుకంటే.. జుట్టుకు ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల చాలా హాని జరుగుతుందని తెలుసుకుంటున్నారు. కారణాలేంటంటే.. మొదటిది ఈ రోజుల్లో మీకు కెమికల్ లేని హెయిర్ ఆయిల్ లభించదు. రెండవది నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం మధ్య.. మీరు…
ప్రస్తుతం జుట్టు రాలడం కామన్ గా మారింది. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు ఎన్నో రకాల శాంపులు, నూనెలు వాడుతుంటాం.
లాస్ ఏంజెల్స్-న్యూయార్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తలపై పేను కనిపించడంతో ఫీనిక్స్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎతాన్ జుడెల్సన్ (Ethan Judelson) అనే ప్రయాణికుడు (UpTicketTalk)లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. విమానం ల్యాండింగ్ గురించి విమానంలో ఉన్న సిబ్బంది సమాచారం ఇవ్వలేదని.. దీని కారణంగా ప్రయాణికులు చాలా ఆశ్చర్యపోయారని అతను చెప్పాడు.
వర్షాకాలంలో అనేక సమస్యలు వస్తుంటాయి. తరచూ కురుస్తున్న వర్షాల వల్ల చాలా మంది జలుబు మరియు దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. చాలా సార్లు ఆఫీసుకు వెళ్లే సమయంలో వర్షం కురుస్తుంది.
ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యానికి, ముఖ్యంగా జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఒక ప్రసిద్ధ ఔషధంలా పనిచేస్తుంది. ఇది జుట్టులోని చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు మెరుగవడానికి దశాబ్దాలుగా ఇంట్లోని ఉల్లిరసాన్ని ఉపయోగిస్తున్నారు.