ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కష్టాలు పెరిగాయి. సత్యేంద్ర జైన్‌పై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ఫైల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు . రత పౌర రక్షణ నియమావళిలోని సెక్షన్ 218 కింద 60 ఏళ్ల జైన్‌పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని అనుమతి కోరింది. ఈడీ దర్యాప్తు, తగినంత సాక్ష్యాలు ఉండటంతో హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ అభ్యర్థన చేసింది. హవాలా ఒప్పందాల ఆరోపణలపై చర్యలు తీసుకుంటున్నారు.
READ MORE: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
కాగా.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై జైన్ తదితరులపై సీబీఐ 2017 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2018 డిసెంబర్‌లో ఛార్జిషీటు దాఖలు చేసింది. 2015-17 మంది ఆయన ఆదాయ మార్గాల కంటే 217 శాతం హెచ్చుగా ఆదాయం కలిగి ఉన్నారని, రూ.1.47 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని సీబీఐ ఆ ఛార్జిషీటులో పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో సుదీర్ఘ కాలం జైలులో ఉండటంతో సత్యేంద్ర జైన్‌కు సిటీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో గత ఏడాది అక్టోబర్ 18 ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించారు. 2022 మేలో జైన్ అరెస్టు కాగా, 2023 మే 26, 2024 మార్చి 18 మధ్య 10 నెలలు మెడికల్ బెయిల్ మినహా తక్కిన కాలమంతా ఆయన జైలులోనే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సత్యేంద్ర జైన్ బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ చేతిలో 21,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
READ MORE: CM Chandrababu: ప్రతిపక్షం లేదని లైట్‌గా తీసుకోవద్దు.. అసెంబ్లీ సమావేశాలపై సీఎం కీలక ఆదేశాలు..