Onion Price Hike: పెరుగుతున్న ఉల్లి ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price Hike: ఉల్లి ధరలు రానున్న రోజుల్లో సామాన్యులకు కన్నీళ్లు తెప్పించవచ్చు. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాల్లో మొబైల్ పాన్ ద్వారా ఉల్లిపాయలను తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 6, 2023న, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే NCCF మొబైల్ వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఉల్లిపాయలు కిలో రూ. 25కి రిటైల్ మార్కెట్‌లో ప్రజలకు లభిస్తాయి.
ఉల్లి ధరల పెరుగుదలను నివారించడానికి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాని హోల్‌సేల్ బఫర్ స్టాక్ నుండి 36,250 టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసింది. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లలో బఫర్ స్టాక్ నుండి విక్రయించే బాధ్యత నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌లకు అప్పగించబడింది. బఫర్ స్టాక్‌ను పెంచేందుకు వీలుగా రైతుల నుంచి అదనంగా 3 నుంచి 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని రెండు ఏజెన్సీలను కోరింది.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
Read Also:Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. నిజమేంటంటే?
హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లలో ఉల్లిపాయల బఫర్ స్టాక్‌ను విడుదల చేయడం ద్వారా ఉల్లి ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆగస్టు 11 నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, కేరళ సహా 12 రాష్ట్రాల్లో 35,250 టన్నుల ఉల్లిపాయలు హోల్‌సేల్ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.
రిటైల్ మార్కెట్‌లో ప్రభుత్వం రూ.25 రాయితీపై ఉల్లిని విక్రయిస్తుండగా బఫర్ స్టాక్ నుంచి ప్రస్తుత ధరకే ఉల్లి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా మరిన్ని ఉల్లిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4, 2023న రిటైల్ మార్కెట్‌లో ఉల్లిపాయ సగటు ధర రూ. 33.41కి అందుబాటులో ఉంది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. ఏడాది క్రితం కిలో ఉల్లి ధర రూ.24.37గా ఉండేది. కోల్‌కతాలో ఉల్లి రూ.39, ఢిల్లీలో రూ.37లకు లభిస్తోంది.
Read Also:Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!