తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక దీరుడు రాజమౌళి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు..ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. అలాంటి రాజమౌళి గురించి ఓ ఇంట్రెసింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది..
రాజమౌళి మొదట పెళ్లి అయిన రమా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట రమకి మ్యూజిక్ డైరెక్టర్ తో పెళ్ళై ఒక కొడుకు పుట్టాక విడాకులు అయ్యాయి. ఆ తర్వాత రమా ని రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రమా కి అంతకు ముందే కార్తికేయ అనే కొడుకు ఉన్నాడు. అలాగే కార్తికేయ కోసం రాజమౌళి మళ్లీ రమతో పిల్లల్ని కూడా కనలేదు. అలాగే మయూకా అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతున్నాడు..
అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అదేంటంటే రాజమౌళి తండ్రి కాబోతున్నాడు అనేది నిజమే. కానీ రమా రాజమౌళి ప్రెగ్నెంట్ కాదు. అయితే రాజమౌళి ఒక అనాధ అమ్మాయిని దత్తత తీసుకోబోతున్నారట. ఈ విధంగా రాజమౌళి మరోసారి తండ్రి కాబోతున్నారు అంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది.అయితే ఆడపిల్లలు అంటే ఉన్న ఇష్టంతో రాజమౌళి మరో అమ్మాయిని దత్తత తీసుకొని పెంచబోతున్నట్లు ఇండస్ట్రీ లో వార్త షికారు చేస్తుంది.. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఏది నిజమో తెలియాలంటే జక్కన్న చెప్పేవరకు ఆగాల్సిందే.. సినిమాల విషయానీకొస్తే.. మహేష్ బాబుతో త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు..