ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభ వేళ.. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ. 49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
Read Also: IPL 2024: సీఎస్కేకు గుడ్‌న్యూస్.. జట్టులోకి కీలక ప్లేయర్!
మరోవైపు.. ఎక్కువగా డేటా కోరుకొనే వారి కోసం జియో ఇప్పటికే రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. 90 రోజుల వ్యాలిడిటీ, 150జీబీ డేటాతో రూ.667 ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీనికి రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి కూడా వాడుకోవచ్చు. మరొకటి.. రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు. ఈ రెండు డేటా ప్యాక్‌లకు బేస్ ప్లాన్ ఉండాల్సిందే. వీటికి వాయిస్ కాలింగ్, ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు ఉండవు. అయితే.. ఐపీఎల్ మ్యాచులను ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ ప్లాన్లను పరిశీలించొచ్చు. కాగా.. ఐపీఎల్ 2024ని ప్రత్యక్షంగా చూడటానికి వీక్షకులకు జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.
Read Also: Nallapureddy Prasannakumar Reddy: నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ వదులుకోను.. వాళ్లు మోసం చేశారు..!
ఇదిలా ఉంటే.. జియో బ్రాడ్ బాండ్, మొబైల్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో జియో ఫైబర్స్, జియో ఎయిర్ పైబర్స్ వినియోగదారులకు 50 రోజులపాటు ఉచిత బ్రాడ్ బాండ్ సేవలను అందించనుంది. ఈ ప్లాన్ 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.