Brett Lee: క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు.
IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.
SRH Ugadi Wishes: నేడు వైజాగ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. నేడు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజాగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియా…
ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) శుక్రవారం తలపడ్డాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించిన అభిమాని ఓ కీలక విషయాన్ని బట్టబయలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జనాలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
Champions Trophy Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. నేడు దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోబోతున్న భారత్.. ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈనెల 9న (ఆదివారం) దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరకు చేరుకుంది. కప్పు కోసం మార్చి 9న దుబాయ్ వేదికగా భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. గ్రూప్ స్టేజి ఓటమి ప్రతీకారానికి న్యూజిలాండ్ ఎదురు చూస్తోంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎంత ప్రమాదకర జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, కప్…
భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా అన్నీ ముగించుకుని వచ్చి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోవాల్సిందే.. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండగే.. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు జరిగాయి. అందులోనూ ఈ రెండు టీముల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ గురించి నివేదికలు వస్తున్నాయి. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరుగుతుందని.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి బ్లాక్‌బస్టర్ మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగనుంది.