ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభ వేళ.. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ. 49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదల కాగా మరోవైపు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ‘భీమ్లానాయక్’ సినిమా ఒకటి. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో ‘భీమ్లానాయక్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.…