కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎంతెంత సంపాదించారో తన దగ్గర జాబితా ఉందన్నారు. ఈరోజు తనను వదిలి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాంటి నేతలను వైసీపీలో చేర్చుకుని తప్పు చేశానని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: Earthquake: జావా సముద్రంలో భారీ భూకంపం.. ప్రజలకు అలర్ట్
తనను నమ్ముకున్న నాయకులను తాను ఎప్పుడూ వదులుకోనని చెప్పారు. వచ్చేది మళ్లీ జగన్ ప్రభుత్వమేనని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలను తన ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను.. నమ్మి దగ్గరకు తీస్తే గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా ఓడిపోయినా గెలిచినట్టు ప్రకటించాం.. కొందరు నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చే డబ్బులకు ఆమ్ముడుపోయారని విమర్శించారు.
Read Also: IPL 2024: దాదా చేతిలో బంతి, పాంటింగ్ చేతిలో బ్యాట్.. నెట్టింట వీడియో వైరల్
భవిష్యత్తులో తానేంటో వారికి చూపిస్తానని తెలిపారు. తాను నోరు విప్పితే వేమిరెడ్డి జిల్లాలో కాదు కదా.. రాష్ట్రంలోనే ఉండరని ఆరోపించారు. కానీ నేను మాట్లాడను.. జగన్ కు చేసిన అన్యాయానికి ప్రజలే వేమిరెడ్డిని ఎన్నికల్లో శిక్షిస్తారని దుయ్యబట్టారు. ఏ రోజూ ప్రశాంతి రెడ్డి ప్రజల్లోకి రాలేదు.. సామాన్యులను మీ ఇంట్లోకి రానిస్తారా అని అన్నారు. డబ్బులతో ఎమ్మెల్యే, ఎంపీలు కావాలని అనుకుంటున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి దుయ్యబట్టారు.