Gold Price Today 22nd July 2023 in Hyderabad: ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండే ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రతిరోజు బులియన్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. అయితే వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలకు నేడు బ్రేక్ పడ్డాయి.
బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 310 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో శనివారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: PM Modi: నేడు దేశవ్యాప్తంగా ఉపాధి మేళా.. 70 వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్స్
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,590గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 79,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 600 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉండగా.. చెన్నైలో రూ. 82,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 82,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 82,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Hair Growth Tips: జామ ఆకులతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు..జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..