ఒకవైపు వర్షాలు, నీళ్లు కలుషితం అవుతున్నాయి.. వాటి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందులో జుట్టు రాలే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా జుట్టు రాలుతుంది.. అందుకు కారణం ఆహారపు అలవాట్లు కూడా మారడమే.. జుట్టు సమస్యల నుంచి విముక్తి కలగాలంటే జామ ఆకులను వాడితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.. ఈ ఆకులను ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక జామ ఆకులతో చేసిన టీ వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది. వీటిలో బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.. దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే జుట్టు నల్లగా మారుతుంది. ఇంకా చుండ్రు కూడా రాకుండా ఉంటుంది.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి… మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి..
ఇకపోతే జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అంతేనా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి….జామాకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అంతేనా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. షుగర్ పేషంట్స్ కు ఈ టీ చాలా మంచిది.. ఈ టీని రోజుకు ఉదయం పూట తీసుకోవడం చాలా మంచిది.. నీరసం లేకుండా రోజంతా ఎనర్జీటిక్ గా ఉంటారు..