Gold Price Today Hyderabad on 2024 January 24: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారికి నిన్న మొన్నటివరకూ ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ.. వరుసగా మూడో రోజు ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జనవరి 24) 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 57,800 వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలానే 24 క్యారెట్ల (999 ప్యూర్ గోల్డ్) బంగారం తులానికి రూ. 63,050 వద్ద స్థిరంగా ఉంది.
ఈరోజు ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.57,950లు ఉండగా.. 24 క్యారెట్ల మేమిలి బంగారం తులానికి రూ. 63,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.57,800 వద్ద ట్రేడింగ్ అవుతుండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 63,050గా కొనసాగుతోంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Dharani Committee: నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ
బులియన్ మార్కెట్లో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గి.. రూ. 75,000గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 500 మేర తగ్గి రూ. 75,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి రేటు రూ. 500 తగ్గి.. రూ. 76,500కు దిగివచ్చింది. ఈ బంగారం, వెండి ధరలు ఎలాంటి పన్నులు లేకుండా సూచించినవి.